Site icon NTV Telugu

Prithviraj Sukumaran : పుష్పతో నా సినిమాను పోల్చకండి.. పృథ్వీరాజ్ కామెంట్స్

Prithvi

Prithvi

Prithviraj Sukumaran : మలయాళ స్టార్‌ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా మూవీ ‘విలాయత్ బుద్ధ’. ఈ మూవీకి సోషల్ మీడియాలో మంచి హైప్ వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన ‘డబుల్ మోహన్’ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర స్టైల్, కథ నేపథ్యం చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను అల్లు అర్జున్‌ మూవీ పుష్పతో పోలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘విలాయత్ బుద్ధ పుష్ప కాపీ’ అనే విమర్శలు మొదలయ్యాయి. ఈ పోలికలపై పృథ్వీరాజ్ తేలికగా తీసుకోకుండా తాజాగా స్పందించారు. ఈ సినిమా పుష్ప తర్వాత చేస్తున్నాం అనే అభిప్రాయం పూర్తిగా తప్పు అన్నారు.

Read Also : Dhandoraa : శివాజీ, నవదీప్ దండోర్ టీజర్ రిలీజ్.. చావు చుట్టూ సినిమా

పుష్ప రిలీజ్‌కు చాలా ముందే మా ప్రాజెక్ట్ మొదలైంది. ఈ కథను మేం ఎప్పుడో స్టార్ట్ చేశాం. సినిమా స్టోరీ జీఆర్ ఇందుగోపాలన్ రచించిన ‘విలాయత్ బుద్ధ’ నవల ఆధారంగా రూపొందిందని వివరించారు. సాచి నుండి మొదలై జయన్ నంబియార్‌ వరకు సినిమా జర్నీ ఉంటుందన్నారు. పృథ్వీరాజ్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పంచుకున్నారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ ఫేం సాచి ఈ కథను తనకు మొదటగా చెప్పాడని.. కానీ అతని అకస్మాత్తు మరణం (2020)తో ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నాడు. సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని ప్రాజెక్ట్‌ను తిరిగి ముందుకు నడిపాడని చెప్పారు.

Read Also : Kakinada: భార్య పిల్లలను హత్య చేసిన కేసులో ఊరట.. 23 ఏళ్ల తర్వాత బెయిల్

Exit mobile version