మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కేరళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు నెలకొన్నప్పటికి అవేమి సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే హీరోగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
Also Read : Andrea Jeremiah : అదరాలతో అదరగొడుతున్న ఆండ్రియా
బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తున్నాడు. మేఘనా గుల్జార్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పృథ్వి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు ‘దైరా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు . ఈ సినిమా గురించి పృథ్వి మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేఘనా గుల్జార్ వర్క్‌కు నేను ఫ్యాన్. ఆమె దర్శకత్వంలో నటించాలనేది నా కల. దైరా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ను ఎంపిక చేశారట. కానీ అనుకోని కారణాల వలన ఆయుష్మాన్ ఈ సినిమా నుండి తప్పుకోగా ఈ కథ పృథ్వి వద్దకు చేరింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసుగా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.