NTV Telugu Site icon

Kantara: కాంతార మూవీని చూడబోతున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..?

Narendra Modi

Narendra Modi

Kantara: దేశవ్యాప్తంగా కాంతార మూవీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నడలో గత నెలలో విడుదలైన ఈ మూవీ అన్ని పరిశ్రమలను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్‌లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియదు. అయినా కూడా కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ మూవీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా నిలిచిన ఈ మూవీని ప్రధాని నరేంద్ర మోదీ అతి త్వరలో వీక్షించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 14న ప్రధాని మోదీకి చిత్ర యూనిట్ ప్రత్యేక స్క్రీనింగ్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో నటించిన రిషబ్ శెట్టితో కలిసి మోదీ ఈ చిత్రాన్ని చూస్తారని తెలుస్తోంది.

Read Also: Karthi: ‘సర్దార్’ హిట్.. పార్ట్ 2 ప్రకటించిన హీరో

ఈ మూవీకి డైరెక్టర్ కమ్ హీరో రిషబ్‌శెట్టి బ్యాక్ బోన్‌గా నిలిచాడు. 2010లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిషబ్ శెట్టికి ఇన్నాళ్లుగా పెద్దగా పేరు రాలేదు. కానీ కాంతార మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. కాగా కాంతార మూవీ కేజీఎఫ్-2 రికార్డులను కూడా బీట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన చిత్రాల్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా కాంతార నిలిచింది. యష్ నటించిన కేజీఎఫ్-2 సినిమా టికెట్లు 75 లక్షలు అమ్ముడవగా.. కాంతార టికెట్లు ఇప్పటివరకు 77 లక్షలు విక్రయమయ్యాయి. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేయగా మంచి లాభాలను అందించింది. ‘కాంతార’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది.