NTV Telugu Site icon

Taraka Ratna: నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం- ప్రధాని మోదీ

Taraka Ratna

Taraka Ratna

నందమూరి తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని మోకిలాలోని ఆయన నివాసానికి తరలించారు. తారకరత్న మృతి తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారక రత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో… ”శ్రీ నందమూరి తారక రత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు మరియు వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం మరియు అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి: PM @narendramodi.” అంటూ ట్వీట్ చేశారు.

Read Also: Nandamuri Family: తారక రత్న ఇంటికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22 1983లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ కుమారుడు. 2002లో ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాద్రి రాముడు’ వంటి చిత్రాలతో సహా 20కి పైగా చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’, ‘కాకతీయుడు’, ‘మనమంతా’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘కయ్యుం భాయ్‌’ వంటి చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. అతను చివరిగా ‘S5 నో ఎగ్జిట్’లో కనిపించాడు.

Show comments