Preminchoddhu Teaser Released: బేబీ సినిమా కథ తనదేనంటూ మీడియా ముందుకు వచ్చి ఒక్కసారిగా ఫేమస్ అయిన శిరిన్ శ్రీరామ్ ఇప్పుడు ప్రేమించొద్దు అనే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిజానికి ఇదే కథను సాయి రాజేష్ కి చెబితే తనకి మోసం చేసి బేబీ సినిమా చేశాడని ఆరోపించారు శిరిన్ శ్రీరామ్. ఇక ఇప్పుడు శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు మేకర్స్.
Lorry Chapter-1: హీరోగా మారిన వివాదాస్పద యూట్యూబర్.. లారి అంటూ వస్తున్నాడు!
అలాగే తెలుగులో విడుదల చేసిన తర్వాత, త్వరలో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కించాం, ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ ఫిల్మ్ అనేలా ఉందని ప్రశంసించారు. నాకు ఎంతగానో సహకరించిన టీంకు థాంక్స్. మా టీం అంతా తెరపై కనిపించనట్టుగా ఉండరు, చాలా కామ్‌గా ఉంటారు. మా సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ చూడండని అన్నారు. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.