NTV Telugu Site icon

Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన

Prathik Gandhi

Prathik Gandhi

“స్కామ్ 1992” హీరో ప్రతీక్ గాంధీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రతీక్ ముంబై పోలీసులు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలు ఎవరో వస్తున్న సమయంలో రోడ్డుపై నడవడానికి ప్రయత్నించిన తనపై ముంబై పోలీసులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ మూవ్మెంట్ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి రోడ్డుపై నడుస్తుండగా… పోలీసులు నన్ను భుజం పట్టుకుని, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఏదో మార్బుల్ గోడౌన్‌లోకి నెట్టారు #అవమానం” అంటూ ట్వీట్ చేశారు.

Read Also : KGF 2 : టార్గెట్ కంప్లీట్… సంబరాల్లో టీం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా ముంబైలోని కీలకమైన వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే (డబ్ల్యూఈహెచ్)పై ప్రజల రాకపోకలకు అడ్డుకట్ట పడింది. ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ప్రతీక్ గాంధీ సినిమాల విషయానికొస్తే… ‘ఫూలే’ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రతీక్ ‘జ్యోతిబా ఫూలే’గా, పత్రలేఖ ‘సావిత్రి ఫూలే’గా నటిస్తున్నారు. ఇది కాకుండా విద్యాబాలన్, ఇలియానా డి’క్రూజ్‌లతో కలిసి ప్రతీక్ గాంధీ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.