Prashanth Neel: ఈయన కింగ్ ఖాన్ పైన పగబట్టినట్లు ఉన్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ని అవాయిడ్ చేస్తుంటే ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు మాత్రం సైలెంట్ గా వార్ కి రెడీ అవుతున్నారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పది రోజుల్లో థియేటర్స్ లోకి రానున్నారు. ఈ క్లాష్ కారణంగా ఓపెనింగ్స్ విషయంలో రెండు సినిమాలకి నష్టం కలుగుతుంది. మరీ ముఖ్యంగా మాస్ సినిమా కాబట్టి సలార్ కారణంగా డంకీ మూవీకి ఊహించని లాస్ జరిగేలా ఉంది. ఫస్ట్ డే డంకీ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టినా కూడా సెకండ్ డే డంకీ కలెక్షన్స్ కి హ్యూజ్ డెంట్ పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే షారుఖ్ ని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు.
ఇలా ఆడుకోకూడదు అనే షారుఖ్ సలార్ సినిమా వస్తున్నా కూడా డంకీ సినిమాని వాయిదా వేయకుండా రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ అయిన తర్వాత సలార్ సినిమా హిట్ అయితే షారుఖ్ ఇమేజ్ దెబ్బ తింటుంది, పైగా ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఒకసారి ఇలాంటి పని చేసాడు. KGF సినిమాని షారుఖ్ జీరో మూవీకి అపోజిట్ లో రిలీజ్ చేసి, షారుఖ్ ని అయిదేళ్ల పాటు సైలెంట్ చేసాడు. ఇప్పుడు హిట్స్ లో ఉన్న షారుఖ్ కి అపోజిట్ గా మళ్లీ సలార్ ని దించుతున్నాడు ప్రశాంత్ నీల్. షారుఖ్ పై పగబట్టాడో లేక యాక్సిడెంటల్ గా జరుగుతుందో తేలియదు కానీ ప్రశాంత్ నీల్ అయిదేళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్లి మరీ షారుఖ్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ఈ క్లాష్ లో ఒకవేళ ప్రశాంత్ నీల్-ప్రభాస్ గెలిస్తే మాత్రం ప్రైమ్ టైంలో, పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ని బీట్ చేసినట్లే అవుతుంది. మరి డిసెంబర్ మూడో వారంలో ఏం జరగబోతుందో చూడాలి.
Also Read
- Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. 'చోటా ముంబై' తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
- The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
- Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
- Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!