Salaar: అది కూడా బయటకి వస్తే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ దెబ్బకు డిజిటల్ రికార్డులన్నీ బద్దలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్.. 2.7 మిలియన్స్ లైక్స్ దక్కించుకుంది సలార్ ట్రైలర్. దీంతో… 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సలార్ ట్రైలర్ భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 135 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే… ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ ట్రైలర్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ చుట్టే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించింది చాలా తక్కువ. అలాగే… ఈ ట్రైలర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశాడు నీల్.
ఈ కారణంగా ట్రైలర్ లో యాక్షన్ కట్ షాట్స్ తక్కువగా పడ్డాయి. అందుకే… ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట ప్రశాంత్ నీల్. ఫుల్ మీల్స్ పెట్టేలా రెండో ట్రైలర్ కట్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ హై ఓల్టేజ్ ట్రైలర్ డేట్ కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 16న, అంటే సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు రెండో ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇందులో గూస్ బంప్స్ ఫైట్స్ సీన్స్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. ఈ ఒక్క ట్రైలర్ అంచనాలకు పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్ సెకండ్ ట్రైలర్, ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగితే సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ ని సీజ్ చెయ్యడానికి రెడీ అయినట్లే. మరి డిసెంబర్ 22న సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?