Pranita : సీనియర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో ఉండే ఈ భామ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకోలేదు. దాంతో అమ్మడికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి. సరే అని వాటిని కూడా వదలకుండా చేసేసింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమకు మెల్లగా దూరం అయిపోయింది.
Read Also : Nabha Natesh : వాళ్లను క్షమించకూడదు.. పహల్గాం దాడిపై నభానటేష్..
బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది ఈ బ్యూటీ. ఆమె చేసే అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. తాజాగా మరోసారి చీరకట్టులో రెచ్చిపోయింది. ఇందులో తన ఘాటు పరువాలను చూపించేసింది. ఫ్రంట్, బ్యాక్ ఫోజులతో తన అందాలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. వయసు పెరిగినా తన అందాలు తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ.