సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చేపట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రకాష్ రాజ్ ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు, పెళ్లిరోజున మొక్కలు నాటుతూ పర్యావరణానికి మేలు చేస్తున్నారని తెలుపుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ని అభినందించారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలన్నా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రకాష్ రాజ్ కోరారు.
Read Also : Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్
మరోవైపు ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మేజర్, కేజీఎఫ్-2, శాకుంతలం, సర్కారు వారి పాట వంటి తెలుగు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా పలు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలలో కూడా కనిపించనున్నారు ప్రకాష్ రాజ్.