Site icon NTV Telugu

Prakash Raj : ఆ విషయం తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా..

Prakash Raj

Prakash Raj

Prakash Raj : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. నిన్న హీరో విజయ్ దేవర కొండను విచారించిన సీఐడీ.. నేడు ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించింది. ప్రకాశ్ రాజ్ నేడు రెండోసారి బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ ముందుకు విచారణకు వచ్చాడు. ఇందులో సీఐడీ అనేక ప్రశ్నలు వేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటెంట్ ఎలా వచ్చింది, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. తాను 2016లో జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశానని.. 2017లో బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ చట్టం తెచ్చిన తర్వాత ప్రమోట్ చేయడం ఆపేశానంటూ తెలిపాడు.

Read Also : Rashmika : రష్మిక దేవరకొండ అంటూ అరిచిన ఫ్యాన్స్.. ఆమె రెస్పాన్స్ ఏంటంటే..?

బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత మంది ఎఫెక్ట్ అవుతారని అప్పుడు తనకు అవగాహన లేక చేశానని.. తెలిసిన తర్వాత ఎవరూ వాటి జోలికి వెళ్లొద్దని జూనియర్లకు చెబుతున్నట్టు వెల్లడించాడు ప్రకాశ్ రాజ్. అయితే సీఐడీ మాత్రం తెలిసి చేసినా, తెలియక చేసినా సరే తప్పే అని.. చర్యలు తప్పవని చెబుతోంది. గతంలో కూడా ప్రకాశ్ ఓ సారి విచారణకు వచ్చాడు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. వాటన్నింటినీ సీఐడీకి బదిలీ చేశారు అధికారులు. త్వరలోనే మంచు లక్ష్మీ, రానా కూడా సీఐడీ విచారణకు రాబోతున్నట్టు తెలుస్తోంది.

Read Also : Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్‌ కీలక నిర్ణయం..

Exit mobile version