Site icon NTV Telugu

‘అఖండ’ టీంలో కరోనా కలకలం… రెండవసారి పాజిటివ్ !

Pragya Jaiswal tests Positive for Covid-19 again

“అఖండ” టీంలో మరోసారి కరోనా కలకలం రేగింది. భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే తెలుగు చాల చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది రివర్స్ అయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే షూటింగ్ సెట్ లో ఒక్కరికి కరోనా వచ్చినా అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే కరోనా, లాక్ డౌన్ అనంతరం షూటింగులు మొదలు పెట్టడానికి మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. ఆ తరువాత కూడా సెట్లో పలు కరోనా నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మరోసారి కోవిడ్ బారిన పడింది.

Read Also : వాట్ అమ్మా.. వాట్ ఈజ్ ఈజ్ దిస్ అమ్మా !

బాలయ్య సరసన “అఖండ”లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించింది. “నాకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఆందోళన చెందడానికి ఏమీ లేదు. మీ అందరినీ త్వరలో కలుస్తాను” అని ప్రగ్యా ట్వీట్ చేసింది. “పూర్తిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఆదివారం ఉదయం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇంతకుముందు ఒకసారి కరోనా వచ్చింది. ప్రస్తుతానికి నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. డాక్టర్ల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత 10 రోజుల నుంచి నాతో కాంటాక్ట్ లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి” అంటూ పోస్ట్ చేసింది ప్రగ్యా. ఇటీవలే బాలయ్య, ఆమె కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో బాలకృష్ణ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version