Site icon NTV Telugu

Pragya Jaiswal: విస్కీ బాటిల్ ముందేసుకుని బాలయ్య హీరోయిన్ రచ్చ

Pragya Jaiswal

Pragya Jaiswal

ప్రస్తుతం స్టార్లు ఒకపక్క సినిమాలతో.. మరోపక్క యాడ్స్ తో రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఇక ఇవే కాకుండా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల చాలామంది హీరోయిన్లు ఆల్కహాల్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ఆల్కహాల్ కంపెనీస్ హీరోయిన్లను ఎంచుకొని వారితో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత కూడా విస్కీ లోని కొత్త బ్రాండ్ ప్రమోట్ చేసిన సంగతి విదితమే.

ఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొంటూ ఇదిగో ఇలా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.  జిమ్ భీమ్ అనే విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ అమ్మడు హాట్ ఫోజ్ లో కనిపించింది. విస్కీ బాటిల్ ని హైలైట్ చేసి ప్రగ్యా బ్లాక్ అండ్ వైట్ లో కనిపించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ మత్తు ఎక్కించే రెండు పక్క పక్కన ఉంటే ఒకటే హైలైట్ అవుతుంది అని చెప్పలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పొతే ప్రస్తుతం ప్రగ్యా  ఒక టాప్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో  తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..

Exit mobile version