తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రగతి కేవలం వెండితెరపైనే కాదు, క్రీడా రంగంలోనూ తన ప్రతిభను చాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి, పవర్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో వరుస పతకాలతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఈ విజయాల పరంపరలో భాగంగా, ఆమె రేపు టర్కీలో జరగనున్న ఏషియన్ గేమ్స్ (ఆసియా క్రీడలు) లో పాల్గొనబోతున్నారు. నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్‌లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్ అని ప్రగతి నిరూపించుకున్నారు. 2023లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన ఆమె, గత రెండేళ్లుగా జిల్లా, ప్రాంతీయ, సౌత్ ఇండియా, మరియు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్‌ను గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Also Read :Akhanda 2: షాకింగ్.. 2026లో ‘అఖండ తాండవం’ రిలీజ్?
ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ మరియు తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెలుచుకోవడం విశేషం.
పవర్ లిఫ్టింగ్‌లో ప్రగతి సాధించిన పతకాల వివరాలు
| 2023 | హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ | గోల్డ్ మెడల్ |
| 2023 | తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (పవర్ లిఫ్టింగ్ ఇండియా) | గోల్డ్ మెడల్ |
| 2023 | నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (తెనాలి) | 5వ స్థానం |
| 2023 | బెంచ్ ప్రెస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (ఎల్బీ స్టేడియం) | గోల్డ్ మెడల్ |
| 2023 | తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీలు (షేక్‌పేట) | గోల్డ్ మెడల్ |
| 2023 | నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (బెంగళూరు) | గోల్డ్ మెడల్ |
| 2024 | సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ | సిల్వర్ మెడల్ |
| 2025 | హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (ఖైరతాబాద్) | గోల్డ్ మెడల్ |
| 2025 | తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (రామాంతపూర్) | గోల్డ్ మెడల్ |
| 2025 | నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ (కేరళ) | గోల్డ్ మెడల్ |
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తన పతకాల ప్రదర్శనతో సత్తా చాటిన ప్రగతి, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్నారు. రేపు టర్కీలో జరగనున్న ఏషియన్ గేమ్స్ లో ఆమె భారతదేశం తరపున పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని, పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.