Pragathi:టాలీవుడ్ నటి ప్రగతి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈమధ్య సినిమాల్లో కన్నా టీవీ షోస్ లోనే ఎక్కువ కనిపిస్తుంది ప్రగతి.. పొడవైన జుట్టు.. కాటుక కళ్ళు.. చేతిపై టాటూ.. ఆమెను చూడగానే ఇవే గుర్తొస్తాయి. సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించే ప్రగతి బయట ఫుల్ స్టైలిష్ గా ఉంటుంది. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. సినిమా.. నా వృత్తి. అక్కడి వరకే.. నాకు ఒక లైఫ్ ఉంటుంది.. ఆ పర్సనల్ లైఫ్ ను ఎలా జీవించాలో నాకు తెలుసు అని నిర్మొహమాటంగా చెప్పుకోస్తూ.. తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతుంది. ఇక ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. ఇక గతంలో ఆమె చెప్పిన ఒక ఇంటర్వ్యూలోని మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ప్రగతి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అమ్మతోనే ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. ఇంట్లో కూర్చొని ఎప్పుడు తింటూనే ఉంటావని అమ్మ అనడంతో పిజ్జా షాపులో పనిచేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
Nikki Tamboli: ఆ ఎద అందాలు.. జాకెట్ లో దాచినా దాగనంటున్నాయా పాప
ఇక డబ్బు కోసం ఒక ఎస్డీడీ బూత్ లో కూడా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. కష్టపడి సంపాదించడంలో తప్పులేదు కదా. ఇక ఆ తరువాత ఒక మంచి సినిమాలో అవకాశం వస్తే.. పొగరు వలన నేనే వదిలేసుకున్నాను అని తెలిపింది. ఇక ఆ సమయంలోనే ఒక నిర్మాతతో ఏర్పడిన గొడవ వలన సినిమాలే చేయకూడదని నిర్ణయించుకొని 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. ఇక ఆ పెళ్ళిలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఆయన చాల మంచి వారు. కానీ, నాకే ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. విడాకులు తీసుకున్నాం. ఇక గంగోత్రితో రీ ఎంట్రీ ఇచ్చాను అని చెప్పిన ప్రగతి ప్రస్తుతం ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోవడం లేదని, చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.