Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు… నిన్న అజిత్ నేడు విక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kollywood Movie Updates : సినీ పరిశ్రమలో హీరోల రెమ్యూనరేషన్ పరిస్థితి ఇప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, మారుతున్న థియేట్రికల్ మార్కెట్, ఓటీటీ వ్యాపారంలో వచ్చిన మార్పులు నిర్మాతలను కొత్త లెక్కలు వేయించేలా చేస్తున్నాయి. ఈ ప్రభావం స్టార్ హీరోల పారితోషికాలపైనా పడుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ రెమ్యూనరేషన్ విషయంలో వార్తలు వినిపించగా, ఇప్పుడు అదే జాబితాలో చియాన్ విక్రమ్ పేరు కూడా చేరడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘చియాన్ 63’ చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ఇరు ముగన్’ ఫేమ్ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను విక్రమ్ కెరీర్లో మరో కీలక చిత్రంగా భావిస్తున్నారు. అయితే సినిమా కథ, యాక్షన్ ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు విక్రమ్ తీసుకుంటున్న పారితోషికం గురించే ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీ ట్రాకర్ ముకిల్ వర్ధనన్ వెల్లడించిన వివరాల ప్రకారం, విక్రమ్ తన గత చిత్రాలతో పోలిస్తే తక్కువ రెమ్యూనరేషన్‌కు అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఆయన సుమారు రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
అయితే ఇది కేవలం ఫిక్స్డ్ ఫీజు మాత్రమే కాకపోవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముందస్తు రెమ్యూనరేషన్‌ను తగ్గించుకుని, సినిమా లాభాల్లో వాటా పొందే విధానాన్ని విక్రమ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలు ఈ మోడల్‌ను పరిశీలిస్తున్న నేపథ్యంలో విక్రమ్ కూడా అదే దారిలో నడుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు.
ఇటీవల విడుదలైన ‘చియాన్ 63’ ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్లో మంచి అంచనాలు పెంచింది. ‘ఫస్ట్ ఫ్లేమ్’ పేరుతో వచ్చిన ఆ వీడియోలో విక్రమ్ పవర్ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ వేగం అందుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రియా షిబు కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎస్. భాస్కర్, ఊర్వశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇక హీరో అజిత్ విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. 170 నంచి 200 కోట్ల రెమ్యూనరేషన్ నుంచి 100 కోట్లకు పడిపోయిందని వార్తల హల్చల్ చేశాయి. మొత్తంగా చూస్తే, ఈ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారనే వార్త నిజమైతే అది కేవలం ఒక హీరో నిర్ణయం మాత్రమే కాదు. మారుతున్న సినీ వ్యాపార పరిస్థితులకు స్టార్ హీరోలు కూడా తగిన విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారనే సంకేతంగా భావించవచ్చు.
- Tags
- Chiyaan Vikram
- cinema
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!