‘ఆర్ఆర్ఆర్’కు సమస్యగా మారనున్న ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం తరువాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫైట్ జరగబోతోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, ప్రభాస్ “రాధే శ్యామ్” రెండూ పాన్ ఇండియా చిత్రాలూ ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హిందీలో “ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం జనవరి 6 నుండి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకూ హిందీలో “ఆర్ఆర్ఆర్”కు గట్టి పోటీ ఉండబోతోందని భావించగా అది కాస్తా క్లియర్ అయ్యింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’కు ఇప్పుడు ప్రభాస్‌కు కొత్త సమస్యగా మారబోతున్నాడు.
హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు విపరీతంగా క్రేజ్ ఉంది. నార్త్‌లో ‘సాహో’ విజయం సాధించడం దానికి నిదర్శనం. ఇక ఇప్పుడు హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘రాధే శ్యామ్’ కోసం రికార్డు స్థాయిలో స్క్రీన్స్ బుక్ చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఉత్తరాన ఇప్పటి వరకు ‘రాధేశ్యామ్’ కోసం 3700 స్క్రీన్లు బుక్ అయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత ఇన్ని స్క్రీన్‌లను కేటాయించడం విశేషం. ఒక దక్షిణాది స్టార్ సినిమా కోసం ఉత్తరాదిన ఇన్ని థియేటర్లు బుక్ అవ్వడం రికార్డు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు.
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
Read Also : నానికి తప్పని రిలీజ్ కష్టాలు !
‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు మధ్య ఒక వారం గ్యాప్ ఉంటుంది. ఆ తరువాత సినిమా బాగుంటే అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లకు ఢోకా ఉండదు. కానీ సినిమా గురించి టాక్ కాస్త అటూ ఇటూ వచ్చిందంటే ‘రాధేశ్యామ్’ అమాంతం ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లను లాగేసుకోవడం ఖాయం. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ నార్త్ లో చాలా వరకు థియేటర్లు బుక్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమా విడుదల తరువాత “ఆర్ఆర్ఆర్” అక్కడ నిలదొక్కుకోవడం కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాజమౌళిని తక్కవగా అంచనా వేయడానికి వీలులేదు. ఆయన వ్యూహాత్మక ప్రణాళిక ఎప్పటికి ప్రత్యేకమైనది. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే “ఆర్‌ఆర్‌ఆర్” ప్రమోషన్స్ కోసం కోట్లాది డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోంది టీం. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ మధ్య నార్త్ లో స్క్రీన్స్ విషయమై టఫ్ ఫైట్ జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తాజావార్తలు
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!