Prabhas Treat : జీర్ణించుకోలేం అంటూ బిగ్ బీ పంచులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భారతీయ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి “ప్రాజెక్ట్ కే” అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో ప్రభాస్, అమితాబ్ పై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రభాస్ తో కలిసి పని చేసిన ఎవరైనా రాజుల విందు, సౌత్ వంటకాల టేస్ట్ చూడకుండా వెళ్లలేరు. ప్రభాస్ ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమైన వంటకాలను, ఆ విందును ఆస్వాదించిన ప్రముఖులు దాని గురించి కథలుకథలుగా చెప్తారు. అయితే ప్రస్తుతం అమితాబ్ వంతు వచ్చింది.
Read Also : RIP Goutham Reddy : సినీ ప్రముఖుల సంతాపం
Also Read
- Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి 'హుషార్ పిట్టలు'.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Allari Naresh : కామెడీ స్టార్ 'అల్లరి నరేశ్' ఈసారైనా నవ్విస్తాడా?
- JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్.. కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందంటే?
- Ashwatthama: షాహిద్ 'అశ్వత్థామ' ఎందుకు ఆగింది?.. ప్రభాస్ 'కల్కి' ప్రభావమే కారణమన్న నిర్మాత
సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న అమితాబ్ ను ప్రభాస్ ఎప్పటిలాగే తమ ఇంట్లో వండిన ప్రత్యేకమైన వంటకాలతో రుచికరమైన ట్రీట్ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమితాబ్ సరదాగా ప్రభాస్ పై, ఆయన విందుపై పంచులు వేయడం ఆసక్తికరంగా మారింది. ‘బాహుబలి’ ప్రభాస్ మీ దాతృత్వం అతీతమైనది. మీరు నాకు ఇంట్లో వండిన రుచికరమైన ఆహారాన్ని తీసుకువచ్చారు. ఆ విందును ఒక ఆర్మీకి తినిపించవచ్చు. కుకీలు ప్రత్యేకం” అంటూనే “మీ అభినందనలు జీర్ణించుకోలేనివి” అంటూ చమత్కరించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన దీపికా పదుకొనె కూడా ప్రభాస్ ఇచ్చిన ట్రీట్ ను రుచి చూసిన విషయం తెలిసిందే.
T 4198 – 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army ..
the special cookies .. beyond scrumptious ..
And your compliments beyond digestible 🤣— Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!