ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా సులభంగా, వేగంగా సినిమాలు చేస్తాడు అని పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే ఒక సబ్జెక్టు ప్రభాస్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ గత సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్త రొమాన్స్ పాళ్ళు కూడా ఎక్కువే అని అంటున్నారు. ప్రభాస్ ఏకంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Read More : సినీ పరిశ్రమ ఏకతాటి పైకి రావాలి… టికెట్ ధరల వివాదంపై మంచు విష్ణు
సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉండే లాగా దర్శకుడు మారుతి ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ప్రభాస్ సినిమాల ఎంపిక చూస్తుంటే మాత్రం ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి ఆయన చేస్తున్న రాధేశ్యామ్ సినిమా పీరియాడిక్ సినిమా కాగా ఆది పురుష్ పురాణాలకు సంబంధించిన సినిమా. అందులో ఆయన రాముడి పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే మారుతి సినిమా లో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.