Site icon NTV Telugu

Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..

Kanthara

Kanthara

Kanthara-1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తూ డైరెక్ట్ చేసిన కాంతార ఓ సెన్సేషనల్. దానికి సీక్వెల్ గా వస్తున్న కాంతార-1 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 2న మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 22న సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మూవీ టీమ్. అయితే తెలుగులో భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది టీమ్. తెలుగు ట్రైలర్ ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ట్రైలర్ కు. ఈ మధ్య ప్రభాస్ చాలా సినిమాకు తన సపోర్ట్ అందిస్తున్న విషయం తెలిసిందే.

Read Also : OG : తుపాకీ ఎక్కుపెట్టిన శ్రియారెడ్డి.. పవన్ సినిమాలో మాసివ్ రోల్

ప్రభాస్ గనక ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తే మూవీపై పాన్ ఇండియా రేంజ్ లో బజ్ పెరగడం ఖాయం అంటున్నారు. మొన్న మిరాయ్ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇస్తే ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ కెమెరాల ముందుకు వచ్చి ట్రైలర్ ను రిలీజ్ చేస్తే క్రేజ్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, తమిళ్ లో శివకార్తికేయన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ తో అంచనాలు పీక్స్ కు వెళ్లిపోతాయని అంటున్నారు. ఈ సినిమాలోనూ రిషబ్ శెట్టి తనవిశ్వ రూపాన్ని చూపించాడని చెబుతున్నారు.

Read Also : Nagarjuna : నాగార్జునను కలిసిన బండారు దత్తాత్రేయ..

Exit mobile version