Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్.. ఇక కాలర్ ఎగరేసుకోండబ్బా!
- తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ప్రభాస్
- ఇప్పుడు అంతకుమించి అనేలా సినిమాలు
- ఇండియన్ స్టార్ హీరోకి ఇది భారీ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas to create a new record for an Indian star in North America: తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అంతకుమించి అనేలాంటి సినిమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆయన సినిమా హిట్టా? ప్లాపా? అనేది పక్కన పెడితే సినిమాలకు బిజినెస్ తో పాటు కలెక్షన్స్ కూడా వేల కోట్లలోనే జరుగుతున్నాయి. వేల కోట్లు అంటే ఒక్కొక్క సినిమాకి వేల కోట్లు కాదు ఆయన చేస్తున్న సినిమాలు కలిపి వేల కోట్లు మార్కెట్తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఒకపక్క ఇండియాలో ఉన్న మార్కెట్ తో పాటు నార్త్ అమెరికాలో ప్రభాస్ ఒక స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. నార్త్ అమెరికా రికార్డ్స్ విషయంలో ప్రభాస్ ఒక సరికొత్త రికార్డు తన పేరు క్రియేట్ చేసుకున్నాడు. అదేంటంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి లేనివిధంగా ఆయన నార్త్ అమెరికాలో రెండు 18 మిలియన్ డాలర్ల గ్రాస్ మూవీస్ అక్కడ రికార్డు చేశారు.
Salaar : 2024 బుల్లితెరపై రికార్డులు బద్దలు కొట్టిన ‘సలార్’
Also Read
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
అంతేకాదు ఆయన చివరి రెండు సినిమాలు కలిపితే 27 మిలియన్ డాలర్లకు పైగానే నార్త్ అమెరికాలో కలెక్షన్స్ వచ్చాయి. సలార్ సినిమాకి 9 మిలియన్ డాలర్లు వస్తే కల్కి సినిమాకి మాత్రం 18 1/2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ రెండు కలిపి దాదాపు 27 మిలియన్ల డాలర్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని రాబోయే సినిమాలకు భారీ రేటు వెచ్చించి అక్కడి రైట్స్ కొనుగోలు చేసేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. రాజా సాబ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు షాకింగ్ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. అలాగే రాబోయే మిగతా ప్రభాస్ సినిమాలకు కూడా దాదాపుగా అంతే డిమాండ్ ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేవలం ఓవర్సీస్ మీదనే 80 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ నిర్మాతలు మాత్రం 100 కోట్లు అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఒక ఇండియన్ స్టార్ హీరోకి ఇది భారీ రికార్డు అనే చెప్పాలి. దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకునే న్యూస్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!