The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ రోజురోజుకూ అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ముందు డిసెంబర్ 5 అనుకున్నారు. కానీ ఆ డేట్ నుంచి వాయిదా వేశారు. జనవరి 9న రిలీజ్ చేస్తామని ఆ మధ్య ఓ ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. ట్రైలర్ లో రెండు పాత్రలు కనిపించాయి. యంగ్ ఏజ్ ప్రభాస్ లుక్ అదిరిపోయింది. కాగా ఓల్డేజ్ పాత్ర వైబ్ మామూలుగా లేదు. నేను రాక్షసున్ని అంటూ చివర్లో చెప్పిన డైలాగ్ ఆ పాత్రను ఎలివేట్ చేస్తోంది.
Read Also : OG : పవన్ ను చూస్తే గర్వంగా ఉంది.. చిరు పొగడ్తలు
మొన్న టీజర్ వచ్చినప్పుడు ఓల్డేజ్ పాత్ర గురించి ఏం చూపించలేదు. కేవలం సంజయ్ దత్ పాత్రను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ లో ప్రభాస్ ఓల్డేజ్ పాత్రను హైలెట్ చేశారు. దీంతో అసలు సంజయ్ దత్ కాకుండా ప్రభాస్ ఓల్డేజ్ పాత్రనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సంజయ్ దత్ ను పాత్ర కంటే ప్రభాస్ ఓల్డేజ్ పాత్రలోనే చాలా ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. ముందు నెగెటివ్ రోల్ లో కనిపించిన తర్వాత.. మంచోడిగా మారిపోయి సంజయ్ దత్ పాత్రను ఎలా అంతం చేస్తాడనేది ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం. మరి సినిమా రిలీజ్ అయ్యాక దానిపై క్లారిటీ వస్తుంది.
Read Also : Rishab Shetty : ఆఫీస్ బాయ్ నుంచి వందల కోట్ల దాకా.. రిషబ్ శెట్టి లైఫ్..