Salaar: సలార్ ఘనవిజయం.. “డార్లింగ్స్”కు ప్రభాస్ స్పెషల్ థ్యాంక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas thanks his fans for salaar Sucess: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్ లో తన సంతోషాన్ని ఈ మేరకు షేర్ చేశారు. “నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి, సలార్ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్” అని ప్రభాస్ పోస్ట్ చేశారు.
Also Read
ఇక ప్రభాస్ చేసిన పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లైస్ పంపుతున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను రూపొందించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజైన సలార్ మరే ఇండియన్ మూవీ సాధించనంత హయ్యెస్ట్ డే 1 ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు 178.7 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లోనూ సలార్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. ఇక శృతి హాసన్, శ్రేయ రెడ్డి, జగపతిబాబు, ఝాన్సీ, రామచంద్రరాజు, ఎమ్మెస్ చౌదరి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..