Site icon NTV Telugu

Sandeep Vanga : సందీప్ వంగాతో నాగ్ అశ్విన్ కు చిక్కులు.. ప్రభాస్ ఇప్పుడెలా..?

Sandeep

Sandeep

Sandeep Vanga : అవును.. నాగ్ అశ్విన్ కు సందీప్ రెడ్డి వంగాతో నానా చిక్కులు వచ్చి పడుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో బోలెడన్ని సినిమాల ఉన్నాయి. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాల షూటింగులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అటు నాగ్ అశ్విన్ కల్కి-2 కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నాడు. ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ మధ్యలోకి సందీప్ రెడ్డి హడావిడి స్టార్ట్ చేశాడు. తన స్పిరిట్ సినిమాను సెప్టెంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించేసుకున్నాడు. తనకు బల్క్ డేట్లు ఇవ్వాల్సిందే అని ముందే కండీషన్ పెట్టుకున్నాడు. సందీప్ కండీషన్ కు ప్రభాస్ కూడా ఓకే అన్నాడు.

Read Also : Chiranjeevi : వాళ్లనే నమ్ముకుంటున్న చిరంజీవి.. రూటు మార్చేశాడా..?

స్పిరిట్ కంప్లీట్ కావాలంటే ఇంకో ఏడాది పట్టేలా ఉంది. అప్పటి దాకా ప్రభాస్ కోసం వెయిట్ చేయడం అంటే నాగ్ అశ్విన్ కు నచ్చట్లేదు. మధ్యలో కొన్ని డేట్లు ఇస్తే తాను మిగతా టైమ్ లో వీఎఫ్ ఎక్స్ పనులు చూసుకుంటానని అనుకుంటున్నాడు. ఎందుకంటే కల్కి మూవీ భారీగా వీఎఫ్ ఎక్స్ మీద ఆధారపడిన స్క్రిప్ట్. అందుకే ప్రభాస్ మధ్యలో కొన్ని డేట్లు ఇచ్చి షూటింగ్ చేస్తే వీఎఫ్ ఎక్స్ లేట్ కాకుండా చూసుకోవచ్చని అనుకుంటున్నాడు నాగ్. కానీ సందీప్ మాత్రం ఒప్పుకునేదే లేదంటున్నాడు. తన మూవీలో లుక్ వేరే సినిమాల్లో కనిపిస్తుందేమో అనుకుంటున్నాడు. అదీ కాక ప్రభాస్ తో కంటిన్యూగా షూటింగ్ చేసేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే నాగ్ అశ్విన్ కు ససేమిరా అంటూనే ప్రభాస్ ను తన గుప్పిట్లో పెట్టేసుకుంటున్నాడు. అటు ప్రభాస్ కూడా న్యూట్రల్ గా ఉంటున్నాడు. ఎవరినీ ఏమీ నొప్పించలేక సైలెంట్ గా ఉండిపోతున్నాడంట. మీరు మీరే తేల్చుకోండి అన్నట్టు చెప్పేశాడంట. చూస్తుంటే కల్కి-2 సినిమాకు చాలా టైమ్ పట్టేలా ఉంది.

Read Also : Vijay – Rashmika : రష్మిక విజయ్ ను గట్టెక్కిస్తుందా..?

Exit mobile version