Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Srinu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ కెరీర్ స్టార్టింగ్ రోజులు, ఫస్ట్ రెమ్యూనరేషన్, అత్యధిక పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటుడిగా మొదటిసారి అందుకున్న పారితోషికం నుంచి ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ ఎలా నిర్ణయిస్తారో వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తొలి సినిమా ‘మనం’ (నాగార్జున గారి చిత్రం కాదు, పాత చిత్రం) కోసం మొదటిసారి రూ.10 వేల రెమ్యూనరేషన్ అందుకున్నానని తెలిపారు. ఆ చిత్ర నిర్మాత రాఘవేంద్ర రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని, ఇంటికి తీసుకెళ్లి ఆప్యాయంగా చూసుకుని తనకు తొలి పారితోషికం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా చిన్న బడ్జెట్‌తో కొత్త హీరోను పరిచయం చేస్తూ తెరకెక్కిందని, నిర్మాత ఎంతో కష్టపడి ఆ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. అంతకుముందు తాను సిటీ కేబుల్‌లో సీరియల్స్ చేస్తూ, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సినిమా తనకు మంచి స్టార్టింగ్ ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటానన్న ప్రశ్నకు స్పందిస్తూ.. సినీ పరిశ్రమలో ఒక నటుడికి ఫిక్స్డ్ పారితోషికం అనే వ్యవస్థ ఉండదని చెప్పారు. సినిమా బడ్జెట్, నిర్మాత సామర్థ్యం, పాత్ర నిడివి, ప్రాజెక్ట్ స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ మారుతూ ఉంటుందని వివరించారు. “ఇండస్ట్రీలో బయట ప్రచారం అయ్యే రెమ్యూనరేషన్లు చాలాసార్లు నిజం కావు. ఒక సినిమా కోసం ఎంత తీసుకున్నామన్నది కంటే, నిర్మాతలు చెప్పుకునే లెక్కలు వేరుగా ఉండొచ్చు. అందుకే బయట వినిపించే సంఖ్యలన్నీ నిజమని అనుకోవద్దు” అని అన్నారు. తాను ఇప్పటివరకు అందుకున్న అత్యధిక పారితోషికం గురించి కూడా ప్రభాస్ శ్రీను ఆసక్తికర విషయం వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా కోసం కేవలం రెండు రోజుల పని చేసినందుకు రూ.3 లక్షలు అందుకున్నానని చెప్పారు. అది తన కెరీర్లో అప్పటివరకు వచ్చిన అత్యధిక పారితోషికమని పేర్కొన్నారు. సినిమాలో పాత్రకు సంబంధించిన మార్పుల కారణంగా తన పని పరిమితం అయినప్పటికీ, నిర్మాతలు ఇచ్చిన పారితోషికం తనకు ఎంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు.
Also Read
- Prabhas Srinu : "రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది".. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
- Nara Rohith: 'కపాలి'తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
- Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
- Prabhas Srinu: 'ప్రభాస్ శ్రీను' పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
తాజావార్తలు
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
-
Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
-
Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
-
Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!