ప్రభాస్ అభిమానుల్లో ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాపై ఉన్న అంచనాలు సామాన్యమైనవి కావు, ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. అయితే, సెట్స్‌లో ప్రభాస్‌ను సందీప్ వంగా ‘టార్చర్’ పెడుతున్నాడంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి, గతంలో ‘బాహుబలి’ సిరీస్ కోసం రాజమౌళి, ప్రభాస్‌ను ఐదేళ్ల పాటు శారీరకంగా, మానసికగా ఎంతో శ్రమకు గురిచేశారు. ఆ తర్వాత ప్రభాస్‌ను అంతలా కష్టపెట్టిన దర్శకుడు మరొకరు లేరు, కానీ, ఇప్పుడు ‘స్పిరిట్’ కోసం సందీప్ వంగా అనుసరిస్తున్న తీరు చూస్తుంటే.. “జక్కన్నే చాలా బెటర్” అని ప్రభాస్ సన్నిహితుల దగ్గర సరదాగా వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read:Anil Ravipudi : రాజమౌళితో కంపారిజన్.. రావిపూడి షాకింగ్ కామెంట్స్
సందీప్ వంగా పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకు రాజీ పడరు, తాజాగా ఒక కీలక సన్నివేశం కోసం ప్రభాస్‌ను సుమారు రెండు గంటల పాటు మండుటెండలో నిలబెట్టినట్లు తెలుస్తోంది. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేక్స్ అయినా తీసుకోవడానికి సందీప్ వెనుకాడటం లేదట, సాధారణంగా పెద్ద హీరోలు రిస్క్ ఉన్న సీన్లకు ‘బాడీ డబుల్’ (డూప్) వాడుతుంటారు. కానీ, సందీప్ మాత్రం “బాడీ డబుల్ వద్దు.. మీరే నటించాల్సిందే” అని ప్రభాస్‌కు ముందే కండిషన్ పెట్టారట. సందీప్ వంగా సినిమాల్లో ‘బోల్డ్ కంటెంట్’ మరియు ‘రా ఇంటెన్సిటీ’ ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలుసు. ‘స్పిరిట్’ విషయంలో కూడా ఆయన అదే పంథాను కొనసాగిస్తున్నారట.
ఇప్పటివరకు తీసింది ఒక్క సీనే అయినా, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం, ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని విధంగా, చాలా పవర్‌ఫుల్ మరియు బోల్డ్ రోల్‌లో సందీప్ ఆవిష్కరిస్తున్నారు. సందీప్ పెడుతున్న కష్టాన్ని ప్రభాస్ కూడా పాజిటివ్‌గా తీసుకుంటున్నారని, సీన్ అవుట్‌పుట్ చూసి డార్లింగ్ ఫుల్ జోష్‌లో ఉన్నారని తెలుస్తోంది, దర్శకుడు పెడుతున్న ఈ ‘టార్చర్’ వెనుక ఒక బలమైన కారణం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ను పూర్తిస్థాయిలో బయటకు తీయడానికే సందీప్ ఇంతలా కష్టపెడుతున్నారని స్పష్టమవుతోంది. రాజమౌళి తర్వాత ప్రభాస్‌ను అంతలా ఇన్వాల్వ్ చేసి సినిమా తీస్తున్న దర్శకుడు సందీప్ వంగానే అని ఇండస్ట్రీ టాక్, మొత్తానికి ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ పడుతున్న ఈ కష్టం థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!
