ఈ జనరేషన్ కి పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్… రెండో సినిమాకే రాజమౌళి అసలైన పోటీ అనే పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది. దాదాపు నెల రోజుల పాటు అభిమానులని ఊరిస్తూ వచ్చిన మేకర్స్, ఇటీవలే డిసెంబర్ 22న సలార్ సీజ్ ఫైర్ ని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టబోయే సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకి తగ్గట్లు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే చాలు సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్ గురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హోంబలే నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని ఫాలో చేసి నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్న వాళ్లకి స్వీట్ షాక్ ఇచ్చింది హోంబలే ఫిల్మ్స్. కొంతమంది సైనికులు గన్స్ పట్టుకోని ఉన్న ఫోటోని సలార్ మేకర్స్ ట్వీట్ చేసారు. ఈ ఫోటోని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్… ట్రైలర్ కట్ చేస్తున్నారేమో అనుకున్నారు. అయితే ఇది ట్రైలర్ కి సంబంధించిన ఫోటో కాదు, సలార్ టీజర్ లోని ఫ్రేమ్. ఇప్పటికే వదిలిన సలార్ టీజర్ లో రిలీజ్ డేట్ ని అప్డేట్ చేస్తూ మేకర్స్ చిన్న ఛేంజ్ చేసారు. ఆ హింట్ ఇస్తూ మేకర్స్ ఈ ఫోటోని వదిలారు. మరి ట్రైలర్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందేమో చూడాలి.
— Salaar (@SalaarTheSaga) October 3, 2023