గత కొన్ని రోజుల్లో ఇండియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న టైములో సలార్ సినిమా వాయిదా పడిందనే మాట వినిపిస్తోంది. దీంతో పాన్ ఇండియా మొత్తం ఒక్కసారిగా కంపించింది. సలార్ సినిమా వస్తుందనే సెప్టెంబర్ 28న ఏ సినిమా రిలీజ్ చేయకుండా అన్ని ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ వేరే డేట్ ని చూసుకున్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే ఉంది అనగా ఇలా సలార్ వాయిదా పడింది అంటే ఏ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలి? అనే డైలామాలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నారు.
ఇది చాలదన్నట్లు ఇకపై రాబోయేది ఫెస్టివల్ సీజన్… దసరా, దీపావళి, సంక్రాంతి… ఈ సీజన్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పటికే లాక్ అయిపోయాయి. ఇప్పుడు సలార్ ఆ ఫెస్టివల్ సీజన్స్ లో ఏ సీజన్ ని టచ్ చేసినా కూడా మిగిలిన సినిమాలకి నష్టం తప్పదు. అందుకే సలార్ సినిమా వాయిదా పడడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపైనే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపైన ఇంపాక్ట్ చూపించింది. అయితే కొంతమంది మాత్రం హోంబలే ఫిల్మ్స్ నుంచి సలార్ వాయిదా పడింది అనే విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రొడ్యూసర్స్ చెప్పలేదు అంటే సినిమా వాయిదా పడకుండా చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ నిజమై సలార్ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయితే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
