ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సంవత్సరం, నెలలు, రోజుల నుంచి గంటల వరకు వచ్చింది సలార్ కౌంట్‌డౌన్. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సలార్ సునామి రాబోతోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో డైనోసర్ ఎంట్రీకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉందని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే సలార్ రన్ టైం గురించి కూడా చర్చ జరుగుతోంది. సలార్ ట్రైలర్ రన్ టైం రెండున్నర నుంచి మూడు నిమిషాల వరకు ఉండే ఛాన్స్ ఉంది. టీజర్‌లో కనీసం ప్రభాస్ మొహం కూడా చూపించలేదు ప్రశాంత్ నీల్. అలాగే కథపై కూడా ఎలాంటి క్లూ ఇవ్వలేదు. దీంతో సలార్ ట్రైలర్ బయటికొస్తే… కథతో పాటు… డార్లింగ్‌ను చూసి పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్.
ఇప్పటికే హోంబలే వారు సలార్ ట్రైలర్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ‘సలార్ టీ షర్ట్స్’ను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. టీషర్టులతో పాటు హుడీలు, హార్మ్ స్లీవ్‌లను కూడా అమ్మకానికి పెట్టారు. అభిమానుల క్రేజ్‌ను ఇలా క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. మరోవైపు ప్రశాంత్ నీల్ ట్రైలర్ కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఎలా చూపించాలో అంతకుమించి చూపించబోతున్నాడు. డైనోసర్‌కు ఇచ్చే ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అందుకే… ఒక్కసారి ట్రైలర్ బయటికొస్తే డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు అవడం గ్యారెంటీ. మరి ఇంత హైప్ ఇస్తున్న సలార్ ట్రైలర్… ఫ్యాన్స్‌కు ఎలాంటి విజువల్ ట్రీట్ ఇస్తుందో చూడాలి.