యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం విదితమే.. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా జరిగిన విషయం తెలిసిందే.. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని, అతడు ఆరోగ్యం మీద, ఫిట్ నెస్ మీద శ్రద్ద పెడితే బావుంటుందని పలువురు విమర్శించారు. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా షూటింగ్ అప్పుడు బాలీవుడ్ ట్రోలర్స్ ప్రభాస్ లుక్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ విషయమై ప్రభాస్ స్పందించకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ ను ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టమని కోరుకున్నారు.
ఇక అభిమానుల కోరిక మేరకు మన డార్లింగ్ ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టినట్లు కనిపిస్తుంది.. తాజాగా ప్రభాస్ లేటెస్ట్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది.. ఈ ఫొటోలో చెక్ షర్ట్ వేసుకొని, తలకు క్యాప్ పెట్టుకొని బియర్డ్ లుక్ లో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు.. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫొటోలో ప్రభాస్ కొద్దిగా బక్కచిక్కి కనిపించాడు. దీంతో ప్రభాస్ తన బాడీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. అంతకుముందు కన్నా ప్రభాస్ ముఖంలో కళ కనిపిస్తుందని, ఇంకొంచెం కష్టపడితే ప్రభాస్ మునుపటి రూపానికి వచ్చేస్తాడని అబిమనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కొత్త లుక్ లో ఉన్న ప్రభాస్ ను చుసిన అభిమానులు దిమ్మతిరిగిపోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.