నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హంట్’ యాక్షన్ ఎక్స్ట్రావెంజాగా రూపొందుతున్న ఈ మూవీని జనవరి 26న ప్రేక్షకుల ముందుకి తీసుకోని రానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. సుధీర్ బాబు ఒక యాక్సిడెంట్ కి ముందు యాక్సిడెంట్ కి తర్వాత చేపట్టిన ఒక కేస్ చుట్టూ ‘హంట్’ సినిమా తిరుగుతోంది అనే విషయాన్ని ట్రైలర్ లో క్లియర్ కట్ గా చెప్పేశారు.
అర్జున్ పాత్రలో కనిపించనున్న సుధీర్ బాబు, తన యాక్సిడెంట్ కి ముందు టేకప్ చేసిన కేస్ ఏంటి? అతను రెడీ చేసిన ఫైల్ లో ఏం ఉంది? యాక్సిడెంట్ తర్వాత తన ఎంక్వయిరీలో రాసుకున్న డైరీలో ఏం ఉంది? డైరీ లాస్ట్ పేజ్ లో వైట్ పేపర్ ఎందుకు ఉంది? అనే ప్రశ్నలతో ట్రైలర్ లాక్ చేసిన మేకర్స్, ఆడియన్స్ లో సినిమా చూడాలి అనే క్యురియాసిటి కలిగించారు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఘిబ్రాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ని ఎలివేట్ చేసింది. శ్రీకాంత్, తమిళ హీరో ప్రేమిస్తే భరత్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న హంట్ మూవీని మహేశ్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న హంట్ మూవీ సుధీర్ బాబుకి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
Every ACTION has a consequence, and we're ready to face it! 😎
Presenting the official trailer of #HUNTTheMovie!
In Cinemas Jan 26th#HuntTrailer#HuntFrom26Janhttps://t.co/ZIjk8siVwe@bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial
— Sudheer Babu (@isudheerbabu) January 18, 2023