NTV Telugu Site icon

Prabhas: ఇది కదా అసలైన మాస్ కటౌట్…

Prabhas

Prabhas

ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సఫిస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, గత కొంతకాలంగా సరైన మాస్ సినిమా చెయ్యలేదు. లవ్ స్టొరీగా రూపొందిన ‘రాదే శ్యాం’ ప్రభాస్ మాస్ ఇమేజ్ కి సరిపోలేదు. ఆ కటౌట్ ఏంటి? ఆయనతో మీరు చేస్తున్న సినిమాలు ఏంటి అని రెబల్ స్టార్ ఫాన్స్ సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు.

చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఒకప్పటి ప్రభాస్ లా కనిపించే సరికి, రెబల్ స్టార్ ఫాన్స్ అంతా ఖుషీ అయ్యారు. అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్యతో కలిసి ప్రభాస్ సందడి చేశాడు. డిసెంబర్ 30న టెలికాస్ట్ కానున్న ఈ షో ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూడు నిమిషాల ప్రోమో ఇచ్చిన కిక్, ఇటివలే ప్రభాస్ చేసిన సినిమాలు కూడా ఇవ్వలేదని ప్రభాస్ ఫాన్స్  అంటున్నారు. దీనికి కారణం ప్రభాస్ హెడ్ స్కార్ఫ్ లేకుండా, లూజ్ టీషర్ట్ వేయకుండా కనిపించడమే. టాక్ షోస్ లో ఇప్పటివరకూ కనిపించని ప్రభాస్, అన్ స్టాపబుల్ స్టేజ్ పైన సూపర్బ్ లుక్ లో కనిపించాడు. లైట్ గా గడ్డం పెంచి, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో ‘మిర్చి’ సినిమాలోని లుక్ ని గుర్తు చేసేలా ఉన్నాడు ప్రభాస్. ఆ కటౌట్ కి సూటు అయ్యే సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్. మరి నీల్ ‘సలార్’ సినిమాలో ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకోని ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడేమో చూడాలి.

Show comments