రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD. సలార్ వంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో… కల్కి పై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మే 9న పార్ట్ 1 కల్కి 2898 ADని, ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు వైజయంతీ మూవీస్ వారు. దీంతో… ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం… కల్కి డిమాండ్ ఓ రేంజ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం మేకర్స్ ఏకంగా వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారట. డిస్టిబ్యూటర్స్ 70 నుంచి 80 కోట్ల మధ్యన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట… కానీ వంద కోట్లు ఇస్తేనే ఓవర్సీస్ రైట్స్ ఇస్తామని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.
వైజయంతీ మూవీస్ కి ఆశించిన బిజినెస్ జరగకపోతే… ఓవర్సీస్ లో ఓన్ రిలీజ్ కి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో కల్కి తెరకెక్కుతుండడంతో… మూవీ మేకర్స్ భారీగా కోట్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఓవర్సీస్ ఒక్కటే అని కాదు… ఇండియాలో కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందట. ఆ నమ్మకంతోనే భారీగా డిమాండ్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా… దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబచ్చన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.