టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు ఫిష్ వెంకట్ చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఫిష్ వెంకట్ కు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.
Also Read : Junior : గాలి జనార్దన్ రెడ్డి కొడుకుతో శ్రీలీల.. వైరల్ వయ్యారి
తండ్రి అనారోగ్యం గురించి చెప్తూ ఆర్థిక సాయం కావాలని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఒక వీడియో ద్వారా వేడుకుంది. అందుకు స్పందించి ‘ హీరో ప్రభాస్ అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు స్రవంతి తెలిపింది. కానీ ఫిష్ వెంకట్ వైఫ్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరు రాలేదు, ఫోన్ చెయ్యలేదు అని చెప్పారని మరొక వర్షన్ బయటకు వచ్చింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్త రచ్చకు దారి తీసింది. ఇందులో ఏది వాస్తవం అనేది తెలుసుకునేందుకు ప్రభాస్ టీమ్ ను వివరణ కోరగా అసలు తమ టీమ్ నుండి కాల్ చేయలేదని తెలిపారు. ఏదైనా ఉంటె తాము మీడియా ద్వారా అధికారకంగా తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ప్రభాస్ ఫలానా వారికి వంద కోట్లు ఇచ్చాడని సోషల్ మీడియాలో లేని పోని న్యూస్ క్రియేట్ చేసారని అన్నారు.