బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘జూనియర్’ టైటిల్ తో వస్తోంది. కిరీటి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి ఫిలిమ్స్ బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీకొర్రపాటి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
కాగా ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్ ‘‘వైరల్ వయ్యారినీ.. నే వయసొచ్చిన అణుబాంబుని’’ అని సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో కిరీటి రెడ్డితో కలిసి టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల స్టెప్పులు అదరగొట్టింది. అలాగే తొలి సినిమా అయినా కూడా కిరిటీ డాన్స్ లు దుమ్ములేపేసాడు. సాంగ్ మధ్యలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కనిపించి నవ్వించారు. దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు తానే స్వయంగా ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, యాక్షన్, స్నేహం అంశాలతో యూత్ ఎంటర్‌టైనర్ గా రాబోతుంది.