Site icon NTV Telugu

Rebel Star : కల్కి 2కు డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. షూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

Kalki 2

Kalki 2

రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ లో రిలీజ్ అయింది. గుడ్ ఆర్ బాడ్ టాక్ సంగతి పక్కన పెడితే వింటేజ్ ప్రభాస్ ను చూశామని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా సంగతి ఆలా ఉంచేతే ప్రభాస్లై నప్‌లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది 2024లో రిలీజైన కల్కి మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్‌కు రెండో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది. అయితే సెకండ్ పార్ట్‌ షూటింగ్ ఎప్పుడు అని  ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

Also Read : Tollywood : సంక్రాంతి సెంటిమెంట్ ఈ ముగ్గురికి వర్కౌట్ అయ్యేనా..?

ఇప్పటికే హను రాఘవపూడి ‘ఫౌజీ’ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఏక కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌ను హ్యాండిల్ చేస్తున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి 2 కోసం కూడా డేట్స్ ఇచ్చాడు. కల్కి 2 ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎప్పుడో స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం రాజాసాబ్ పనులు ముగించిన డార్లింగ్ ఫిబ్రవరి నుంచి కల్కి 2 సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. పార్ట్ వన్‌ సమయంలోనే కొంత మేర షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నాగ్ అశ్విన్. సెకండ్ పార్ట్‌ విఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం పట్టేలా ఉంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ పై సన్నివేశాలు షూట్ చేసి సీజీ వర్క్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా బాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెళ్తున్నాడు ప్రభాస్.

Exit mobile version