నిన్న మొన్నటి వరకు “రాధేశ్యామ్” ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపిన సినిమా విడుదల సమయంలో లేకుండా పోయాడు. ‘సాహో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మన యంగ్ యంగ్ రెబల్ స్టార్ “రాధేశ్యామ్” సినిమాతో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ప్రభాస్ వెకేషన్ కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Read Also : Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్
ఈ సినిమా కోసం ప్రభాస్ హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం లాంటి నగరాల్లో జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ప్రభాస్. ఇక “రాధేశ్యామ్” విడుదలకు కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉండగా, ఆయన వెకేషన్ కోసం యూరప్ వెళ్ళినట్లు సమాచారం. కొన్నాళ్ల పాటు వెకేషన్ ఎంజాయ్ చేసిన తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో పాల్గొనే అవకాశం కన్పిస్తోంది. అయితే ప్రభాస్ ఇలా సినిమా విడుదలకు ముందు ట్రిప్ కి వెళ్లడం వెనుక ఆసక్తికర రీజన్ ఉంది. ఇక్కడే ఉంటే సినిమా రిజల్ట్ టెన్షన్ వెంటాడుతుందని, అందుకే తన ప్రతి సినిమా విడుదలకు ముందు ప్రభాస్ వెకేషన్ కు వెళ్ళిపోతారట. ఇటీవల జరిగిన “రాధేశ్యామ్” ప్రమోషన్లలో ప్రభాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.