NTV Telugu Site icon

Hombale Films: ఏ బాబు నిద్రలేయ్… నెల రోజుల్లో రిలీజ్ ఉంది

Salaar

Salaar

ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన స్టార్ హీరో ప్రభాస్, మూడో సినిమాతోనే రాజమౌళి రికార్డులకు ఎసరు పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సలార్ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరో నెలన్నర రోజుల్లో సలార్ సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకి వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ని వణికించనుంది. టీజర్ తో సినిమా రేంజ్ ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్, కనీసం ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా డిజిటల్ రికార్డులని క్రియేట్ చేసాడు. ఆ రేంజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సీజ్ ఫైర్ నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుందా ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు.

ఇండిపెండెన్స్ డే రోజున సలార్ సాంగ్ విషయంలో అప్డేట్ వస్తుంది అనుకున్నారు కానీ హోంబలే ఫిల్మ్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ సీజ్ ఫైర్ సాంగ్ విషయంలో అప్డేట్ ఇచ్చి తీర్సాల్సిందే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. వీ వాంట్ అప్డేట్, రిలీజ్ సలార్ ఫస్ట్ సాంగ్, వేకప్ సలార్ టీమ్ అంటూ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ దెబ్బకి అయినా హోంబలే ఫిలిమ్స్ రెస్పాండ్ అయ్యి సలార్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి. నెలన్నర రోజులే రిలీజ్ కి మిగిలి ఉన్న సమయం అనే విషయం గుర్తించి ప్రమోషన్స్ ని చేయడం మంచిది.

Show comments