Site icon NTV Telugu

Prabhas Fans: మొత్తానికి షారుఖ్ ని స్కామ్ స్టార్ చేసారు…

Salaar Vs Dunki

Salaar Vs Dunki

బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డంకీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి షారుఖ్ నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని ఇబ్బంది పెట్టాలని చూసాడు అనే మాట స్ప్రెడ్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ షారుఖ్ పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. మొదటిరోజు సలార్ సినిమాకి నార్త్ లో చాలా తక్కువ థియేటర్స్ వచ్చాయి, డంకీ ఫ్లాప్ అయ్యింది కాబట్టి సలార్ కి నార్త్ లో థియేటర్స్ లభించాయి.

Read Also: Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?

స్లోగా స్టార్ట్ అయినా కూడా సలార్ సినిమా నార్త్ లో వంద కోట్ల గ్రాస్ రాబట్టింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్… సోషల్ మీడియాలో dunki scams ka baap, DINOSAUR CRUSHED DONKEY అంటూ ట్యాగ్స్ ని క్రియేట్ చేసి కార్పొరేట్ బుకింగ్స్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు. డంకీ కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ నెగటివ్ ట్రెండ్ ని ప్రభాస్ సినిమాపై మొదలుపెట్టిందే షారుఖ్ ఫ్యాన్స్… ఇప్పుడు వాళ్లు చేసినదాన్ని వాళ్లకే రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే డంకీ సినిమా వరల్డ్ వైడ్  దాదాపు 250 కోట్లకి పైగా రాబట్టింది. సలార్ సినిమా వారం రోజుల్లో 500 కోట్లని దాటింది అంటే సలార్ సినిమా డంకీ మూవీని ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్ తో బీట్ చేసింది.

Exit mobile version