Prabhas Fans in Tension over Salaar 2 after NTR Movie Opening: ఓ వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2ని ట్రెండ్ చేస్తున్నారు. చెప్పాలంటే సలార్ 2 గురించి ఓ రేంజ్‌లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో, లేక మరో కారణం ఏదైనా ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు నీల్. కానీ గతంలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగష్టులో ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే.. ఇప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించారు. దీంతో.. సలార్ 2 సంగతేంటి? ఎప్పుడు ఉంటుంది? అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ ప్రజెంట్ కమిట్ అయిన సినిమాల తర్వాతే ఉంటుందని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం కెజియఫ్, సలార్ ప్రస్తావన తీసుకొస్తున్నారు.
Jr NTR – Mahesh: ఒక్క ట్వీట్‌కు సోషల్ మీడియా షేక్!
గతంలో సలార్ 2 స్టార్ట్ చేసిన తర్వాత.. కెజియఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసినప్పటికీ.. ముందు సలార్ 2నే పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే పార్ట్ 1తో పాటు కొంత వరకు సలార్ 2 షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నీల్. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ నడిచింది. కానీ ఫైనల్‌గా ఎన్టీఆర్ సినిమా ముందుకొచ్చింది. దీంతో.. ఇప్పట్లో సలార్ సీక్వెల్ ఉండే ఛాన్స్ లేదని.. రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్ తర్వాత ఉంటుందనే మాట వినిపిస్తోంది. లేదంటే.. ప్రశాంత్ నీల్ రెండు సినిమాలను సమాంతరంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.