NTV Telugu Site icon

What is Project K: ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో గేమ్సా? టీషర్టుల విషయంలో అసలు నిజమేంటి?

Project K T Shirts

Project K T Shirts

Prabhas fans demanding What is Project K T shirts: బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ హీరోగా ఎలాంటి సినిమా వస్తున్నా ఆ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంటోంది. అయితే ఇప్పుడు ప్రభాస్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నా ఆయన హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీప్రాజెక్టు K మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాజెక్టు కే సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకోన్‌ హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. అంతేగాక లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాని ప్రాజెక్టు K అని సంబోధిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను జులై 20న జరగనున్న ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ వేడుకలో చేస్తామని కూడా ప్రకటించారు. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న రేంజ్ లో అసలు ఈ ప్రాజెక్టు K అంటే ఏంటి అనే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే పనిలో పడింది సినిమా యూనిట్.

Anand Deverakonda: రష్మికతో రిలేషన్ గురించి అడిగిన రిపోర్టర్.. షాకిచ్చిన చిన్న దేవరకొండ

అందులో భాగంగా what is ప్రాజెక్టు K అని ఉన్న కొన్ని ఫ్రీ టీ షర్ట్లు కూడా ఇస్తున్నామని, ఆ ఫ్రీ టీషర్ట్స్ దక్కించుకోవాలంటే ఒక లింక్ ఫిల్ చేసి మాకు పంపాలని చెబుతూ వైజయంతి మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కూడా లింక్ పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే టీషర్ట్స్ అందుబాటులో ఉంచామని చెప్పి ఇప్పటికే మూడుసార్లు వేరువేరుగా లింకులు ట్వీట్ చేశారు. ముందుగా జులై 10 సాయంత్రం 7:11 నిమిషాలకు లింక్ పెడితే అది ఓపెన్ చేసే లోపు సెకండ్ల వ్యవధిలోనే సర్వర్ డౌన్ అని చూపించిందట. ఈ విషయాన్ని వైజయంతి మూవీ దృష్టికి ట్వీట్లు, కామెంట్ల ద్వారా తీసుకు వెళ్తే మరోసారి అవకాశం కల్పించారు. అప్పుడు కూడా సర్వర్ డౌన్ ఎర్రర్ రాగా మూడోసారి కూడా మరో అవకాశం కల్పించారు.

Chiranjeevi: చిరంజీవి తదుపరి సినిమాకి ముహూర్తం ఫిక్స్

అయితే ఆ మూడోసారి జస్ట్ నాలుగు నిమిషాలకే స్టాక్ అయిపోయిందని వైజయంతి మూవీస్ ప్రకటించింది. టిక్నికల్ ఎర్రరో లేక నిజంగానే స్టాక్ అయ్యేంతలా బుక్ చేసేశారో కానీ ప్రభాస్ అభిమానులు ఏమో అసలు ఇంకే ఓపెన్ కావడం లేదు, ఎవరు స్టాక్ బుక్ చేశారు? స్టాక్ అయిపోవటం ఏంటి? అని ఒక రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. టీ షర్ట్ లు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు వైజయంతీ సంస్థ వీడియోలు పెట్టడం తప్ప ఇప్పటివరకు తమకు టీ షర్ట్ అందిందని ఒక్క అభిమాని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. ఈ క్రమంలోనే విషయం మీద వైజయంతి మూవీస్ సంస్థ స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభాస్ అభిమానుల్లో నిర్మాణ సంస్థ ఇమేజ్ డామేజ్ ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

Show comments