Salaar: సాహో లో ఒక డైలాగ్ ఉంటుంది.. ఎవరు వీరంతా అని శ్రద్దా అంటే ప్రభాస్ .. ఫ్యాన్స్ అని చెప్తాడు. ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి అంటే.. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్తాడు. అది కేవలం డైలాగ్ కు మాత్రమే పరిమితం కాదు అని ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరూపిస్తూనే ఉంటారు. డార్లింగ్ కు ఫ్యాన్స్ కానీ వారంటూ ఎవరు ఉండరు. ట్రోల్స్ చేసేవారు ఉన్నా కూడా వారి గురించి ప్రభాస్ ఏనాడు పట్టించుకున్నది కూడా లేదు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇక ఈ మధ్యనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆరేళ్ళ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అభిమానుల ఆకలిని తీర్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దేవరథ రైజర్ గా ప్రభాస్ నటన వేరే లెవెల్ అని చెప్పాలి.
ఇక ఇందులో ప్రభాస్.. చిన్నప్పుడు వరద కోసం ఒక విలన్ తో పోరాడతాడు. అప్పుడు కరెంట్ తీగను పట్టుకోవడంతో దేవా ఎడమచేతికి కరెంట్ షాక్ కొట్టడంతో.. ఆ చేతికి గాయం అవుతుంది. అందుకోసమే ఎప్పుడు ఆ లెఫ్ట్ హ్యాండ్ కు దేవా బ్లాక్ మాస్క్ తో కవర్ చేస్తూ ఉంటాడు. చివర్లో ఆ గాయం కనిపించకుండా టాటూ వేయించుకుంటాడు. ఇక తాజాగా ఒక ప్రభాస్ అభిమాని.. ఆ కరెంట్ షాక్ కొట్టినప్పుడు దేవాకు ఎలా అయితే గాయం అయ్యిందో అలానే టాటూ వేయించుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మెడ దగ్గరనుంచి చేతి మణికట్టు వరకు.. నరాలు కనిపించినట్లు టాటూ వేయించుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఒరేయ్.. ఇంత దారుణంగా ఉన్నారేంటిరా.. దాన్ని టాటూగా ఎలారా.. ? అని కొందరు.. పిచ్చి అంటారు సర్ దీన్ని అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.