Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను రాబట్టింది. బాహుబలి తరువాత ప్రభాస్ కు వచ్చిన అతిపెద్ద హిట్ అంటే సలార్ అనే చెప్పాలి. ఇక సలార్ ప్రభాస్ యాక్టింగ్, లుక్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటికీ సలార్ థియేటర్ లో రన్ అవుతూనే ఉంది. ఇక సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ మధ్యనే చిత్ర బృందం జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, హోంబాలే మేకర్స్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా కూడా మారాయి.
ఇక తాజాగా సినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్, ప్రశాంత్ నీల్.. మంగుళూరుకు దగ్గరలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసి.. ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇక వీరితో పాటు హోంబాలే నిర్మాతలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. వైట్ కలర్ షర్ట్ .. అదే కలర్ హెయిర్ క్యాప్ తో కనిపించాడు. ఇక కల్కి లో ప్రభాస్ ఈ లుక్ లోనే కనిపించనున్నాడని టాక్. ఇకపోతే ఈరోజే కల్కి రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. మే 9 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.