Prabhas Birthday: వంగా స్టైల్‌లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!

Prabhas Birthday

Prabhas Birthday

Prabhas Birthday: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే అంటేనే అభిమానులకు పండుగ వాతావరణం ఉంటుంది. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతుంటే, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన వైల్డ్ స్టైల్‌లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, బయటకు వచ్చిన ఒక క్రేజీ పిక్ నెట్టింట సెగలు రేపుతోంది.

ఆ ఫొటోలో సందీప్ రెడ్డి వంగా చేతిలో డ్రింక్ బాటిల్ ఓపెన్ చేస్తూ పూర్తి వంగా మార్క్ వైబ్‌తో కనిపిస్తుంటే, పక్కనే ఉన్న ప్రభాస్ ఎంతో సరదాగా నవ్వుతూ పోజులిచ్చారు. ‘స్పిరిట్స్ ఆర్ హై’ అంటూ షేర్ చేసిన ఈ పిక్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టే ఇద్దరూ కలిసి పంచుకున్న ఈ రియల్ ‘స్పిరిట్’ మూమెంట్ చూస్తుంటే, వంగా డార్లింగ్‌తో ఏ రేంజ్ రచ్చ ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను ఊపేసిన సందీప్, ఈసారి ప్రభాస్‌ను తెరపై ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తాడోనని అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై కూడా టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. గతంలో 2027 మార్చి 5న విడుదల చేయాలనుకున్నప్పటికీ, తాజా మార్పులతో దీపావళి కానుకగా 2027 అక్టోబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.