Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పాకింది అంటే అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి ప్రస్తుతం ఆయన చేతిలో వరుస పాన్ ఇండియా సినిమాలు ఉండడం, ఆ సినిమాల కోసం ప్రపంచమంతా ఎదురు చూడడం తెల్సిందే. ఇప్పటికే అతనిపై గౌరవంతో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహంను ఆవిష్కరించారు. సౌత్ హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబుకు తప్ప ఇప్పటివరకు ఆ మ్యూజియంలో మరో హీరో మైనపు విగ్రహం లేదు. ఇక ఈ మధ్యనే మైసూర్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహం ఆవిష్కరించినట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ విగ్రహం ప్రభాస్ లా లేదు అని అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విగ్రహం పై బాహుబలి నిర్మాత శోభయార్లగడ్డ ఫైర్ అయ్యాడు. అసలు ఆ విగ్రహం ప్రొఫెషనల్ చేసినట్టు లేదని, మాకు విగ్రహం చేస్తున్నట్లు కూడా ఎవరూ చెప్పలేదని, వెంటనే దాని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపాడు.
Nani- Mrunal: అబ్బబ్బ.. ఈ జంట ఎంత ముద్దుగా ఉన్నారు
ఇక శోభు యారలగడ్డ ట్వీట్ పై మైసూరు మ్యూజియం అధికారులు స్పందించారు. ” ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా చేయలేదు.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి.. మ్యూజియం నుంచి విగ్రహాన్ని తొలగిస్తాం” అని వారు తెలిపారు. దీంతో ఈ ట్రోలింగ్ పుల్ స్టాప్ పడినట్టే అని తెలుస్తుంది. ఇకపోతే అమరేంద్ర బాహుబలి విగ్రహం మ్యూజియంలో ఏర్పాటు చేయాలంటే ముందుగా నిర్మాతల అనుమతి తీసుకోవాలి. అలాగే విగ్రహం తయారైన తర్వాత నిర్మాతలకు చూపించి వారు ఓకే అంటేనే దాన్ని మ్యూజియంలో ఆవిష్కరించాలి. దీనికి సంబంధించిన పూర్తి హక్కులు నిర్మాతలకే ఉంటాయని తెలుస్తుంది. మరి మైసూర్ మ్యూజియంలోని అధికారులు మరోసారి నిర్మాతలను మెప్పించి ప్రభాస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.