పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ల పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ రియల్ కపుల్స్ ని గుర్తుచేస్తూ ఉంటుంది. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ చిత్రాల్లో వారిద్దరి రొమాన్స్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఈ జంట బయట కూడా ప్రేమికులే అన్న వార్తలు ఇప్పటికి అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేననీ స్వీటీ, ప్రభాస్ తేల్చి చెప్పేసారు. ఇకపోతే బాహుబలి తరువాత అనుష్క- ప్రభాస్ కలిసి నటించలేదు. అయినా వీరి రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్నే రాధే శ్యామ్ నుంచి సెకండ్ సింగిల్ ‘నగుమోము తారలే’ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ప్రభాస్ సముద్ర తీరేనా పూజా హెగ్డే పాదం తాకుతూ రొమాన్స్ చేస్తున్న ఒక ఫోజ్ ని ‘మిర్చి’ చిత్రం స్ఫూర్తిగా తీసుకున్నారని అభిమానులు వాదిస్తున్నారు.
‘మిర్చి’లో ప్రభాస్, స్వీటీ పాదాన్ని పట్టుకొని ఉన్న స్టిల్ ని, ఈ స్టైల్ కి జత చేసి రొమాంటిక్ హీరో డార్లింగ్, రెండు జంటల్లో ఒకరే హీరో… కానీ హీరోయిన్ మారింది! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మరోసారి వార్తల్లో ప్రభాస్- అనుష్క రొమాన్స్ గురించి చర్చలు మొదలయ్యాయి. పూజా ప్లేస్ లో అనుష్క ఉండి ఉంటె ఇంకా బావుండేది అంటూ అభిమానులు తమ కోరికను బయటపెడుతున్నారు. ఇకపోతే రాధేశ్యామ్ చిత్రం సంక్రాతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. మరి మిర్చి రొమాన్స్ హిట్ అయినట్టుగానే రాధేశ్యామ్ రొమాన్స్ హిట్ అవుతుందో.. లేదో చూడాలి.
