Pan-India Film: ఆల్మోస్ట్ ఫిక్స్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్!

  • బాక్సాఫీస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ప్రభాస్
  • ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
  • ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే క్రేజీ కాంబో
  • ప్రభాస్, ఆదిత్య ధర్ కాంబోలో సినిమా
Prabhas Aditya Dhar Movie

Prabhas Aditya Dhar Movie

Prabhas and Aditya Dhar Pan-India Movie: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ‘రెబల్ స్టార్’ ప్రభాస్. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టగల స్టార్ హీరోగా ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు.. అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ప్రభాస్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురవడం పరిపాటిగా మారిపోయింది.

మరోవైపు బాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య ధర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నాడు. ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కించిన ‘ధురంధర్’ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న ఆదిత్య ధర్.. భారీ స్థాయి యాక్షన్, విజువల్ ట్రీట్ అందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు ప్రభాస్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, కథతో పాటు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్, ఆదిత్య ధర్ సినిమా కేవలం ఒక పార్టుతోనే ముగిసే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఆదిత్య ధర్ ఈ కథను రెండు భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా, ఆదిత్య ధర్ విజన్ కలిస్తే.. ఇండియన్ సినిమా రికార్డులు మరోసారి తిరగరాయడం ఖాయం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ప్రభాస్, ఆదిత్య ధర్ కాంబో పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.