పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో జస్ట్ ఒక సాంపిల్ చూపించాడు. దీనికి పీక్ స్టేజ్ చూపించడానికి మరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సుజిత్ రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ని ‘OG’గా ప్రెజెంట్ చేస్తూ సుజిత్ ‘They Call Him OG’ సినిమా చేస్తున్నాడు. ఇటివలే గ్రాండ్ లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బాంబేలో స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వీక్ నుంచి “OG’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో సుజిత్, పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది చిన్న గ్లిమ్ప్స్ ఇచ్చాడు.
ముంబైలో ప్రైవేటు పోర్ట్ నైట్ ఎఫెక్ట్ లో సీన్ ఓపెన్ చేస్తే… ఒక సిగరెట్ వెలిగింది, ఆ ఫైర్ లో గన్నులు పట్టుకోని డంగి, ఫైజాల్ ఇద్దరూ రివీల్ అయ్యారు. ఈ ఇద్దరూ కోటకి ఎంట్రెన్స్ లో లాక్ చేసి ఉన్న ఒక పెద్ద గేటు దగ్గర నిలబడి ఉన్నారు. “వందకి పైగా మనుషులు ఆయుధాలతో ఈ కోటకి కాపలాకాస్తున్నారు. వాళ్లని దాటుకోని అతను కోటలోకి ప్రవేశించాలి అనుకుంటే అది అతని మూర్ఖత్వం’ అన్నాడు డంగి. ఇంతలో పోర్ట్ నుంచి బుల్లెట్స్ సౌండ్ వినిపించాయి, ఫైజల్-డంగి సౌండ్ వచ్చిన వైపు చూస్తే వాళ్లకి ఫైర్ చుట్టూ ముట్టడం కనిపించింది. అది అర్ధం చేసుకునేలోపు ఇద్దరి ముందు ఒక స్మోక్ బాంబ్ వచ్చి పడింది. ఆ స్మోక్ ని చీల్చుకుంటూ సిల్హౌట్ లో ఒక మనిషి రావడం డంగి, ఫైజల్ గమనించారు. ఎవరు వస్తున్నారు అనేది అర్ధంకాని ఫైజాల్…”నువ్వు ఏం చూసావ్” అని డంగిని అడిగాడు. నల్లని మేఘాలు ఆకశాన్ని కమేస్తున్న ఆ సమయంలో చీకటి నుంచి వెలుగులోకి ఒక మనిషి వచ్చాడు అతనే మన హీరో. ఫైజాల్ ప్రశ్నకి సమాధానంగా ‘A Fire Strom… and its coming” అన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ‘OG’గా ఇంట్రడ్యూస్ అయ్యాడు.
సీన్ అదిరిపోయింది కదా, ఇదే రేంజులో ఉంది డీవీవీ ఎంటర్టైన్మెంట్ రిలీజ్క్ చేసిన వీడియో. స్వోర్డ్స్, గన్స్, గ్రనైడ్స్, బుల్లెట్స్, పెన్స్, పేపర్స్… ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ మా గ్యాంగ్ స్టర్ సినిమాలో ఉన్నాయి అని క్లియర్ కట్ గా చెప్పేశాడు దర్శకుడు సుజిత్. ప్రీవిజువలైజేషణ్ అర్ట్ వర్క్ చూస్తుంటే ‘పంజా’ సినిమా వైబ్స్ గుర్తొస్తున్నాయి. పంజా సినిమాలో జై క్యారెక్టర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్యారెక్టర్ ని మించే రేంజులో పవన్ కళ్యాణ్ ని “OG”గా చూపించబోతున్నాడు సుజిత్. వీడియో ఎడిట్ చేసిన విధానం, కాన్సెప్ట్ ని కన్సీవ్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా ఉంది. సుజిత్ మేకింగ్ ఏంటో మొదటి సినిమాతోనే అందరికీ తెలుసు కానీ ‘OG’ని మాత్రం అతను చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడు అనే విషయం ఈ చిన్న వీడియోతోనే అర్ధం అయ్యింది.
ఇక ఈ వీడియోకి తమన్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు, వీడియో ఎండ్ లో ఒక్క ఫ్రేమ్ లో అయినా పవన్ కళ్యాణ్ కనిపించి ఉంటే ఈరోజు సోషల్ మీడియా తగలడి పోయేది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఏ సినిమా ఇవ్వని కిక్, హైప్ ఇస్తూ ‘OG’ సినిమాపై అంచనాలని భారీగా పెంచుతున్నారు. వీడియో చూసిన ఫాన్స్ ‘హైప్’తో సచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా గూస్ బంప్స్ స్టఫ్ ని ఇచ్చాడు సుజిత్. నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక్క పోస్టర్ కాని ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో హవోక్ క్రియేట్ అవుతుంది.
We are beginning the shoot of our film #OG today in Bombay… https://t.co/GHxG8txrsn
The #OG @PawanKalyan garu will be joining us next week🔥🔥 @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥
— DVV Entertainment (@DVVMovies) April 15, 2023