పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే పవర్ స్టార్ మల్ల యోధుడి లుక్ చూసి పండగ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన విజువల్స్ అదిరిపోయాయి. దాంతో హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత మొదలైన సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి, రిలీజ్ కూడా అవుతున్నాయి కానీ హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం జరగడం లేదు. అసలు ఈ సినిమా ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనేది కూడా డౌటే అంటున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయినా కూడా మధ్యలో కాస్త టైం చూసుకొని… సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉందని వినిపించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… పవన్ ఇప్పట్లో ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదని వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల తర్వాతే హరిహర వీరమల్లుకి డేట్స్ ఇస్తాడనే టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే హరిహర వీరమల్లు అటకెక్కినట్టేనా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే, ఒకవేళ రాజకీయంగా పవన్‌కు కలిసొచ్చినా, రాకపోయినా అప్పటి పరిస్థితులు షూటింగ్‌కు అనుకూలించకపోవచ్చు. మేకర్స్ మాత్రం ఎలక్షన్స్ తర్వాతనైనా పవన్ డేట్స్ ఇస్తే… వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి 2025 దసరాకైనా సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈలోపు క్రిష్ మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. అయితే ఇలాంటి విషయల్లో నిజనిజాలేంటనేది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే.