Site icon NTV Telugu

Akhanda2 : వాయిదా హైప్.. అఖండ 2 సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్

Akhanda

Akhanda

బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా పడి ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 11తేదీన అనగా గురువారం రాత్రి 9 గంటలకు పైడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీ అయింది.  మరికొద్ది సేపట్లో అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. వాస్తవంగా చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ టైమ్ లో ఉన్న హైప్ కంటే ఇప్పడు వస్తున్న రిలీజ్ టైమ్ లోనే  హైప్ ఇంకా పెరిగిందనే చెప్పాలి.

Also Read : Rajnikanth : ఈ సారి రజనీ బర్త్ డే చాలా స్పెషల్.. ఎందుకంటే?

ఓవర్సీస్ లో అఖండ 2 సినిమా బుకింగ్స్ ను  గత రాత్రి ఓపెన్ చేయగా జస్ట్ 6 గంటల వ్యవధిలోనే నార్త్ అమెరికాలో సినిమా బుకింగ్స్ 100K డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ సినిమా పవర్ ఏంటో చూపించింది. అటు ఆడియెన్స్ కూడా ఈ సినిమా ఒకసారి వాయిదా పడడంతో ఇప్పుడు ఎలాగైనా చూసేయాలి అని బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. అలాగే ఇంతటి భారీ బుకింగ్స్ కు మరొక కారణం టికెట్ ధరలు అని కూడా చెప్పాలి. ఫస్ట్ రిలీజ్ అపుడు ఈ సినిమా ఒక్కో టికెట్ ధరను 30 డాలర్స్ ఉండగా ఇప్పుడు 16 నుండి 20 డాలర్స్ ఫిక్స్ చేయగా బుకింగ్స్ సాలిడ్ గా దూసుకెళ్తున్నాయి.  టికెట్ రేట్స్ తగ్గించి నార్మల్ టికెట్ రేట్స్ ను పెట్టడం మాసివ్ బుకింగ్స్ కి హెల్ప్ అయ్యింది అని చెప్పాలి. ఇక తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ర్యాంపేజ్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది.

Exit mobile version